నిమ్మకాయతో ఇలా చేస్తే మోచేతులు, మోకాళ్లపై నలుపు మాయం.. 

మోకాళ్లు, మోచేతులపై చర్మం పలుచగా ఉండడం వల్ల సూర్య రశ్మి త్వరగా నల్లబడుతుంది.

దీని కారణంగా హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.

చాలా మంది చేతులు, కాళ్ల కోసం మానిక్యూర్‌, పెడిక్యూర్‌ వంటి ట్రీట్మెంట్స్ చేయిస్తూంటారు.

కానీ మోకాళ్లు, కాలి మడమలు, మోచేతులపై ఏర్పడే పిగ్మెంటేషన్ గురించి అంతగా శ్రద్ధ చూపరు.

దీని కారణంగా ఆ ప్రాంతాల్లో చర్మం గరుకుగా, నల్లగా మారుతుంది.

నిమ్మకాయలోని బ్లీచింగ్‌ లక్షణాలు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, కాంతివంతం చేస్తుంది.

సగానికి కోసిన నిమ్మ ముక్కపై కొంత ఉప్పు జల్లి మోచేతులు, మోకాళ్లపై పది నిముషాలపాటు రుద్దాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.