పసుపు పాలు: హోమ్ రెమిడీస్‌లో పసుపు పాలు అందరికీ తెలిసిందే. గాయాలు త్వరగా నయం కావాలంటే పసుపు పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.
సీజన్ మారినప్పుడు ఫ్లూ సమస్య వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో పసుపు పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమై ఫ్లూ వంటి సమస్యలు దరిచేరవు.
వేప టీ: వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. వేపాకును చాలా రకాల మందుల్లో వినియోగిస్తారు.
వర్షకాలంలో సంభవించే వ్యాధుల నుంచి రక్షించేందుకు వేపాకులతో టీ తయారు చేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.
ములేటీ: వర్షాకాలంలో ఎదురయ్యే అంటు వ్యాధుల్నించి రక్షించుకునేందుకు ములేటీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ప్రకృతిలో లభించే అద్భుతమైన మూలిక ములేటీ. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు సులభంగా దూరమౌతాయి.
అల్లం టీ: వర్షంలో తడిస్తే సాధారణంగా జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు. అందుకే వర్షాకాలంలో సాధారణ టీ కంటే అల్లం టీ తాగడం మంచి అలవాటు. అల్లం ఆరోగ్యానికి ప్రయోజనకరం.
వర్షాకాల సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెట్, యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలుంటాయి.
వెల్లుల్లి:తినే ఆహారంలో వెల్లుల్లి ఉపయోగం పెంచితే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వెల్లుల్లి జలుబు, దగ్గు వంటి సమస్యలకు తక్షణం ఉపశమనం కల్గిస్తుంది.