మధుమేహం (డయాబిటిస్) దీర్ఘకాల సమస్య. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించటంతో పాటు క్రమం తప్పకుండా మందులేసుకోవటమూ తప్పనిసరి
TV9 Telugu
మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. దానిని అదుపులో ఉంచుకోకుండే ఎన్నో అనర్ధాలు తలెత్తుతాయి
TV9 Telugu
గ్లూకోజు నియంత్రణలో లేకపోయినా చాలామందిలో పైకి ఎలాంటి ఇబ్బందులూ కనిపించవు. దీంతో అంతా బాగానే ఉందనుకోవటం పొరపాటు. ఉన్నట్టుండి మందులు ఆపేస్తే గ్లూకోజు మోతాదులు వేగంగా పెరుగుతాయి
TV9 Telugu
ఇన్‌ఫెక్షన్లు, రక్తంలో ఆమ్లాలు పోగుపడే (డయాబిటిక్ కీటోఅసిడోసిస్) ముప్పు పెరుగుతుంది. మధుమేహం చడీ చప్పుడు లేకుండా శరీరాన్ని దెబ్బతీస్తుంది. చూపు పోవటం, కిడ్నీ వైఫల్యం, కాళ్లకు పుండ్లు పడి తొలగించే పరిస్థితి రావటం వంటి దీర్ఘకాల విపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది
TV9 Telugu
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయలు వరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
ఉల్లిపాయలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయను తింటే రక్తంలో చక్కెర స్థాయి త్వరగా అదుపులోకి వస్తుందట
TV9 Telugu
అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. అవసరమైతే రుచి కోసం నిమ్మరసం జోడించవచ్చు
TV9 Telugu
ఉల్లిపాయ సలాడ్, చట్నీ, వెజిటబుల్ గ్రేవీ ఇలా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది. ఉల్లిలో పీచు, పొటాషియం, మాంగనీసు, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6 వంటి పోషకాలెన్నో దండిగా ఉంటాయి