30 September 2023
అరటి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్లు, రైబోప్లేవిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి
అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. ఎముకలు బలంగా, ధృడంగా తయారవుతాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రోజూ సాయంత్రం వేళ అరటిపండును తీసుకోవడం వల్ల శరీరబడలిక తగ్గి హాయిగా నిద్రపోతారు.
అరటిపండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొందరు మాత్రం అరటిపండును ఎక్కువగా తినకూడదు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు అరటిపండును తక్కువగా తినాలి.
ఊపిరితిత్తుల్లో శ్లేష్మం, సైనస్ వంటి సమస్యతో ఇబ్బంది పడే వారు అరటిపండును తక్కువగా తీసుకోవాలి.
శ్లేష్మంతో ఇబ్బంది పడేవారు అరటిపండును ఎక్కువగా తీసుకోవడం వలన శ్వాస తీసుకోవడం వలన ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.