13 August 2023
భోజనం చేసిన తరువాత కొందరికి కడుపు ఉబ్బరంగా, ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడే చిట్కాలు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత ఈ సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపులో ఇబ్బంది తగ్గుతుంది.
భోజనం చేసిన తరువాత దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు మంచి నీరు తాగొద్దు. ఇలా చేయడం వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
భోజనం చేసిన తరువాత 20 నుంచి 30 నిమిషాల పాటు సాధారణంగా నడవాలి. కాసేపు అటూ ఇటూ నడవటం వలన జీర్ణ క్రియ మెరుగవుతుంది.
మీరు తినే ఆహారంలో పెరుగును కలుపుకోవాలి. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అజీర్తి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉంటే.. పూదీనా టీ తాగాలి. పూదీనా టీ.. అపానవాయువు, వికారం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.
ఉదర సంబంధిత సమస్యలన్నింటికీ వాము ఉత్తమమైన ఔషధంగా ఆయుర్వేదం చెబుతుంది. దీనిని తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణ క్రియ మెరుగవుతుంది.
భోజనం చేసిన తరువాత సొంపు తినాలి. దీనిని తినడం ద్వారా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.