16 September 2023
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. అది కచ్చితంగా బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కారణం అయి ఉండొచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఏదైనా వ్యాధి కారణంగా, శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. దానిపై శ్రద్ధ వహించి గుర్తిస్తే ఆ వ్యాధి తీవ్రతను సకాలంలో నివారించవచ్చు.
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే సెప్సిస్ కు చాలా కారణాలు ఉండవచ్చు. దీని కారణంగా, శరీరంపై వివిధ లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని విస్మరించకూడదు.
జ్వరాన్ని సాధారణ వ్యాధిగా పరిగణిస్తారు. కానీ ఎటువంటి కారణం లేకుండా శరీర ఉష్ణోగ్రతలో పదే పదే మార్పు వచ్చినప్పుడు.. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి.
హఠాత్తుగా హృదయ స్పందన పెరుగుదల లేదా తగ్గుదల సమస్యను గమనించినట్లయితే.. తప్పకుండా శ్రద్ధ వహించాలి. బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆక్సిజన్ ప్రవాహం తగ్గుతుంది.
బ్లడ్ ఇన్ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో, చర్మం రంగులో మార్పు, స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు సంభవించవచ్చు. అందుకే.. శరీరంలో ఏవైనా మార్పులు సంభవిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా, ప్లేట్‌లెట్ కౌంట్ కూడా పడిపోతుంది. దీని కారణంగా రోగి బలహీనంగా, మైకముతో బాధపడుతుంటారు.
పరీక్షలో బ్లడ్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయితే.. వెంటనే చికిత్స తీసుకోవాలి. అలాగే మీరు తినే ఆహారం పైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.