చల్లని వాతావరణంలో వేడి వేడిగా టీ తాగడాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయి.
అందువల్ల, సీజనల్ వ్యాధులను నివారించడానికి హెర్బల్ టీ తాగవచ్చు. వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు నుండి మిమ్మల్ని హెర్బల్ టీలు రక్షిస్తాయి.
రోజూ ఈ హెర్బల్ టీలు తాగడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. ఈరోజు కొన్ని రకాల హెర్బల్ టీల గురించి తెలుసుకుందాం.
హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసిని పూజిస్తారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
తులసి మిమ్మల్ని అనేక సమస్యల నుండి రక్షిస్తుంది. వర్షాకాలంలో తులసి టీ తాగవచ్చు. ఇది తలనొప్పి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది.
వర్షాకాలంలో అల్లం టీ తాగవచ్చు. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ నుండి రక్షణ ఇస్తుంది. అంతేకాదు ఈ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
నిద్రలేమి సమస్య ఉన్నవారికి చామంతి టీ మంచి సహాయకారి. సీజనల్ వ్యాధ్యులైన వైరల్ ఫీవర్, జలుబు, ఫ్లూ , ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ టీని తాగవచ్చు.
బరువు తగ్గడానికి గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో, అంటు వ్యాధుల రక్షించడంలో సహాయపడుతుంది.