ఎండు చేపలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..

13 August 2023

డ్రై ఫిష్ ఒక ప్రసిద్ధ సైడ్ డిష్. ఇది ఆసియా దేశాల్లో భాగా ప్రాచుర్యంలో ఉంది. చాలా మంది తమ భోజనంలో భాగంగా తింటారు. దీనిని కూరగా కూడా వండుకుంటారు.

డ్రై ఫిష్

ఎండు చేపలు రుచిని అందించడమే కాదు.. మంచి పోషకాలకు మూలకాలు కూడా. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డ్రై ఫిష్

ఎండు చేపల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ముఖ్యంగా క్రీడాకారులు తినడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. మాంసాహారం తినడం ఇష్టంలేకపోతే వీటిని తినొచ్చు.

డ్రై ఫిష్

ఎండు చేపలు శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును నియంత్రిస్తుంది. వ్యాధుల వ్యాప్తిని తగ్గిస్తుంది.

డ్రై ఫిష్

ఎండు చేపల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. డ్రై ఫిష్‌లో చాలా పోషకాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

డ్రై ఫిష్

ఎండు చేపలు తినడం వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒమేగా 3 ఇందులో ఉండటం వలన మెదడుకు మేలు చేస్తుంది. మెదడు దెబ్బతినకుండా కాపాడుతుంది.

డ్రై ఫిష్

ఎండు చేపల్లో విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. ఇది దంతాలను, ఎముకలను బలపరుస్తుంది. వీటిని తినడం ద్వారా సహజమైన విటమిన్ డి ని పొందవచ్చు.

డ్రై ఫిష్

ఎండు చేపలు తినడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డ్రై ఫిష్

ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఎండు చేపలు తినడం వలన అందులోని పోషకాలు గుండెను సంరక్షిస్తుంది.

డ్రై ఫిష్