31 May 2024

నవ్వేద్దాం డ్యూడ్‌..  పేయేది ఏముంది. 

Narender.Vaitla

నవ్వడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక మంచి కామెడీ సీన్‌ చూస్తే వెంటనే మార్పు కనిపిస్తుంది. మనసు తేలికపడుతుంది.

బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే నవ్వుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిత్యం నవ్వడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించింది బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.

ఎక్కువ కాలం బతకాలని ఉందా. అయితే నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆయుష్షును పెంచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుందని మీకు తెలుసా.? అవును నవ్వుతున్న సమయంలో బ్రెయిన్‌లో డోపమైన యాక్టివేట్ అవుతుంది. ఇది శరీరంలో యాంటీ బాడీల ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే నిత్యం నవ్వుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నవ్వు మెరుగైన వాస్క్కులర్‌ పనితీరు ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

అంతేకాదు నవ్వు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. ఒత్తిడి కలిగించే కార్టిసోల్‌ విడుదల కాకుండా చూస్తుంది.

ఇక శరీరంలో నొప్పులను తగ్గించే శక్తి కూడా నవ్వుకు ఉందని నిపుణులు చెబుతున్నారు. నవ్వే సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్‌ ఒళ్లు నొప్పులను తగ్గించడంఓల ఉపయోగపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.