షుగర్ పేషెంట్స్‌కి ముల్లంగి దివ్యౌషధం. ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిండచంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముల్లంగి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ కేలరీలు ఉండడమే దీనికి కారణం.
రక్తపోటు నియంత్రణలో కూడా ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
ముల్లంగి విటమిన్లు, ఖనిజాలకు పెట్టింది పేరు. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో రోగాల బారిన పడడం తగ్గుతుంది.
జీర్ణ సంబంధిత వ్యాధులకు కూడా ముల్లంగితో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం జీవ క్రియను మెరుగుపరుస్తుంది.
శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో కూడా ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.