చలికాలం గుడ్డు తింటే లాభాలెన్నో.. 

15 December 2023

కోడి గుడ్డు పోషకాలకు పెట్టింది పేరు. విటమిన్‌ ఏ, బీ2, బీ5, బీ12, బీ6, విటమిన్‌ ఈ, కేలతో పాటు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

సాధారణంగా చలి కాలంలో విటమిన్‌ డీ లోపం ఏర్పడుతుంది. అయితే రోజుకో గుడ్డు తినడం వల్ల విటమిన్‌ డీ లోపాన్ని జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇక చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో కోడిగుడ్డు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్స్‌ యాంటీ బాడీస్‌ను తయారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 

చలికాలంలో ఫ్లూ, జలుబు, ఇన్ఫెక్షన్లను తట్టుకోవడంలో జింక్‌ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంలో జింక్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు దరి చేరవు. 

మంచి కొలెస్ట్రాల్ పెరగడంలోనూ కోడి గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కోడు గుడ్డు మేలు చేస్తుంది. చలికాలంలో వచ్చే గుండె సమస్యలకు గుడ్డుతో చెక్‌ పెట్టొచ్చు. 

బీ6, బీ12లు కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో వచ్చే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరడానికి ఈ విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

చలికాలంలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు కోడి గుడ్డు ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.