ఇక బీట్‌రూట్ క్యాన్సర్‌ను నయం చేయడంలోనూ ఉపయోగపడుతుంది. బీట్‌రూట్ కు ఎరుపు రంగును కలిగించే బీటా సవయానిన్కు పెద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
బీట్‌రూట్ జ్యూస్ తాగితే శరీంలో కొవ్వు కరిగిపోతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకాన్ని దూరం చేయడంలో బీట్‌రూట్ ఉపయోగపడుతుంది.
బీట్‌రూట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. బీట్‌రూట్ జ్యూస్‌ను క్రమంతప్పకుండా తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.