ఈ ఆకు కూర ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

22 August 2023

గంగవెల్లిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి శరీరంలోని కొల్లాజెన్ , రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, అలాగే గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది.

గంగవాయిల (గంగవెల్లి) కూరలో అధికంగా బీటా కెరోటిన్‌ ఉంది. దీని కాండం, ఆకుల ఎర్రటి రంగుకు కారణమైన వర్ణద్రవ్యం.

ఈ ఆకులలో కనిపించే యాంటీఆక్సిడెంట్లలో బీటా కెరోటిన్ ఒకటి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తాయని అనేక పరిశోధనలో వెల్లడైంది.

ఈ ఆకు కూర ప్రీ రాడికల్స్ సెల్యులార్ డ్యామేజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆకు కూరల్లో గంగవెల్లి ముఖ్యమైంది. అందుకనే హృదయాన్ని భద్రంగా కాపాడుతుంది.

ధమనులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు హార్ట్ ఎటాక్, ఇతర గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

ఈ మొక్కలో ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అందువలన ఎముకలు బలహీనపడి.. వచ్చేబోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.

ఈ ఆకూ కూరను తరచుగా తీసుకోవడం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.  బోలు ఎముకల వ్యాధి తో పాటు వృద్ధాప్యం తో వచ్చే ఎముకల సమస్యలను  నివారిస్తుంది.