బాస్మతి బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

17 August 2023

సాధారణంగా వినియోగించే బియ్యంతో పోలిస్తే బాస్మతి బియ్యం ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే మెరుగైనవి బాస్మతి బియ్యం అని చెప్పవచ్చు.

ఇక ఈ బాస్మతి బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయితే సాధారణ బియ్యంతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువగా ఉంటాయి.

అందువల్లనే స్పెషల్ అకేషన్ సమయంలో జీరా రైస్, కిచిడీ, ఫలావ్, బిర్యానీ వంటి స్పెషల్ ఆహారపదార్ధాల తయారీ సమయంలో బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తారు.

భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఈ బాస్మతీ బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ మరింత పెంచడాని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి.

బాస్మతి రైస్ తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. బాస్మతి బియ్యంతో వండిన ఆహారం తేలికగా జీర్ణమయ్యే అవకాశం ఉంది.

బాస్మతి బియ్యంలో “థియామిన్” అనే విటమిన్ ఉన్నట్లు పలు అధ్యయనాలు ద్వారా తేలింది. ఈ విటమిన్ ను వైద్య శాస్త్రంలో బ్రెయిన్ విటమిన్ అని కూడా అంటారు.

ప్రత్యేకమైన విటమిన్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత తక్కువ సమయంలోనే నాడీ వ్యవస్థ సామర్ధ్యాన్ని పెంచుతుంది.

దీంతో ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులను దూరంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.