ఎప్పుడు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
25 August 2023
చాలామంది చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు. కానీ కొంతమంది సులువుగా చేస్తారు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఇట్టే చేసేస్తారు.
కొంతమంది ఆరోగ్య కారణాల దృష్ట్యా చల్లటి నీటితో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చల్లటి నీళ్లతో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
చల్లటి నీటితో స్నానం చేసినప్పుడల్లా రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది.
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. కానీ చల్లని నీటితో స్నానం మీ చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది.
ఇది మంటను తగ్గిస్తుంది, మొటిమల సమస్యను కూడా తొలగిస్తుంది. అలాగే జుట్టు కూడా దెబ్బతినకుండా, చిట్లకుండా ఉంటుంది.
తెల్లవారుజామున చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని టాక్సిన్స్, మురికిని వదిలించుకోవచ్చు. అంతేకాదు వివిధ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లని కూడా చంపుతుంది.
చల్లని జల్లులు ఒత్తిడిని దూరం చేస్తాయి. మానసిక స్థితిని త్వరగా శాంతపరుస్తుంది. నిరాశను తగ్గిస్తుంది. సోమరితనం, అలసటను వదిలిస్తుంది.
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇది మీ నిద్ర రుగ్మతలను నయం చేస్తుంది. త్వరగా రిలాక్స్ అయి ప్రశాంతంగా ఉంటారు.