24 August 2023
దానిమ్మ గింజలే కాదు, దాని తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదే..!
దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి ప్రతి రోజూ తాగితే అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
దానిమ్మ తొక్కల్లోని యాంటీబాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యలను పరిష్కరించగలవు.
దానిమ్మ తొక్కల పేస్ట్ ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ తొలిగిపోయి మీ చర్మం తలతల మెరుస్తుంది.
క్యాన్సర్ సంభవించే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా దానిమ్మ తొక్కలు ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిట్లు ఇందుకు సహాయపడతాయి.
దానిమ్మ తొక్కలను నీళ్లల్లో వేసి మరిగించి, ఆ నీటిని తాగితే షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. ఇంకా ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది.
వీటిల్లో అధికంగా ఉన్న యాంటీయాక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెదడు పనితనాన్ని మెరుగుపరుస్తాయి.
దానిమ్మ తొక్కలు గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరమే. వీటికి శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి ఉంది.
ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తపోటు, గుండెపోటు సంభవించే ప్రమాదం తగ్గుతుంది. ఇంకా గుండె ఆరోగ్యం ఉంటుంది.
దానిమ్మ తొక్కల్లోని టానిన్లు, పొలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఎముకలను కూడా బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
ఇక్కడ క్లిక్ చే్యండి..