గర్భిణీలు చింతపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
29 August 2023
గర్భిణీలు చింతకాయను లేదా చింత పండును తినడం వల్ల పుట్టబోయే బిడ్డ నెలలు నిండకుండా జన్మించే పరిస్థితి రాదు.
అంతేకాదు చింతకాయ తింటే తల్లులు కూడా జెస్టేషనల్ డయాబెటిస్ దరి చేరకుండా జాగ్రత్తపడవచ్చు.
చింతకాయాల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
దీంతో తల్లులు తరుచుగా వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా బిడ్డల ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది.
ఇక చింతకాయల్లో విటమిన్ బి3 అధికంగా ఉన్న కారణంగా కడుపులో బిడ్డ ఎదుగుదలకు కోసం సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా బిడ్డ, మెదడు, జీర్ణ వ్యవస్థ, మ్యూకస్ వంటి అవయవాలు సరిగా పెరిగేందుకు దోహద పడతాయి.
ఇక గర్భిణీలకు ఉదయం లేవగానే వాంతి, వికారం వచ్చినట్లు భావన కలుగుతుంది. అలాంటి వారు కూడా చింతకాయలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
సాధారణంగా గర్భిణీలు మలబద్దకం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ ఈ సమస్యల నుంచి రక్షిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి