మోతాదులో పానీపూరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనలు ఇవే..
10 August 2023
పానీపూరిలో మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్లు ఏ, బీ6, బీ12, సీ,డీ వంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పానీపూరి గురించి బరువు తగ్గిస్తుంది.
పానీపూరిలో ఉపయోగించే నీరు జీలకర్ర, పుదీనా, చింతపండు వంటివి వాడతారు. అలాగే పుదీనా నీరు, జీలకర్ర బరువు తగ్గడానికి మంచివి.
బరువు తగ్గడానికి మాత్రమే కాదు. పుదీనా నీరు జీర్ణక్రియకు కూడా మంచిది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది.
అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పుదీనాలో ఫైబర్, విటమిన్ ఎ, ఐరన్, మాంగనీస్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
పానీపూరి తింటే నోటిలోని అల్సర్లు తగ్గడంలో సాయం చేస్తుంది. ముఖ్యంగా పానీపూరీ వాటర్ కారణంగా అవి సాధారణంగా హీల్ అయ్యి త్వరగా తగ్గే అవకాశం ఉంది.
జల్ జీరాలో బ్లాక్ స్లాట్ లేదా బ్లాక్ పెప్పర్ వంటి ఇతర పదార్థాలు వాడతారు. ఇవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఆమ్లతను నిర్వహించడంతో సాయం చేస్తాయి.
పానీపూరీ తినడం వల్ల తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిల గురించి చింతించకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు హ్యాపీగా వీటిని తినవచ్చు.
అయితే మీరు వాటిని పరిమిత పరిమాణంలో తినాలని గుర్తుంచుకోవడం ఉత్తమం. మోతాదు ముంచితే మాత్రం భారీ నష్టాలు.