మఖానా రోజు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
01 September 2023
మఖానాలో తక్కువ మొత్తంలో ఉండే సోడియం, అధిక మొత్తంలో ఉండే పొటాషియం రక్తపోటుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తాయి.
ఇందులో తక్కువగా ఉన్న సోడియం బ్లడ్ ప్లజర్ అదుపులో ఉంచుతుంది. మెగ్నీషియం శరీరంలోని రక్తం, ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.
మఖానాలో కాల్షియం అధికంగా ఉన్న కారణంగా ఎముకలను బలోపేతం చేయడమేకాకుండా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్లు తక్కువగా ఉండే మఖానా మంచి ఎంపిక. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచేలా చేస్తాయి. వీటిల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
వీటిల్లోని మెగ్నీషియం అధికంగా, సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం మూలంగా ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారు నిరభ్యంతరంగా తినవచ్చు.
వీటిల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది.
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేసి, యవ్వనంగా ఉంచుతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
మఖానాలో థయామిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసకుంటే కాగ్నిటివ్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి