పరగడుపున జామపండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

26 August 2023

జామ పండులో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తిని బలోపితం వల్ల తరచూ వ్యాధుల బారినపడే వారికి సహాయపడుతుంది.

దీనిలో ఉన్న ఫైబర్‌ శరీర బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. దీన్ని తింటే తక్కువ క్యాలరీలతో అవసరమైన విటమిన్‌లు శరీరానికి అందుతాయి.

దీనిలో కేవలం 37 క్యాలరీస్‌ మాత్రమే ఉంటాయి. బరువు  తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళు జామను ఆహారంలో చేర్చుకుంటే మేలు జరుగుతుంది.

జామ పండ్లలో ఫైబర్‌ మంచి మొత్తములో ఉంటుంది. దీంతో జీర్ణ క్రియ మెరుగుపడి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

జామ పండును తరచూ తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో మహిళలకు వచ్చే కడుపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

దీనిలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం కారణంగా గుండె సమస్యలు దూరమవుతాయి. బీపీ నుంచు కూడా ఉపశమనం కలుగుతుంది.

జామ పండులో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు ఉన్నాయి. ఇవి లైకోపీన్ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సమస్య రాకుండా కాపాడుతాయి.

జామపండ్లలో పుష్కలంగా ఉండే ఫైబర్‌ తక్కువగా ఉండే గ్లైసెమిక్ కారణంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.