రోజూ గ్రీన్ యాపిల్‌ తింటే బోలెడు లాభాలు..

28 August 2023

గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న కారణంగా మేలు చేయడంతోపాటు పలు వ్యాధులను దూరం చేస్తాయి.

గ్రీన్ కలర్ యాపిల్ మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి చాలా మంచిదని భావిస్తారు. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా గ్రీన్ యాపిల్స్ తీసుకోవాలి.

గ్రీన్ యాపిల్స్ లో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఉంటుంది. వయసు దాటిన తర్వాత  ఎముకలు బలహీనపడిన మహిళల్లో ప్రతిరోజూ గ్రీన్ యాపిల్ తినవచ్చు.

ఇందులో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియకు మేలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

దీన్ని జీర్ణక్రియకు ఎంతో మంచిదని చెబుతారు. ఇందులో ఉన్న  ఫైబర్ కారణంగ జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,  ఖనిజాలు వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు బరువుని కూడా తగ్గిస్తుంది.

దీని మంచి పరిమాణంలో ఉన్న విటమిన్ ఎ వల్ల కళ్లకు మేలు చేకూరుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఊపిరితిత్తులకు మేలు చేయడంలో గ్రీన్ యాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని తింటే ఊపిరితిత్తులను బలోపేతం చేసి శ్వాస సమస్యలను దూరం చేస్తుంది.