రోజూ ఖర్జూర పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
21 August 2023
ఖర్జూర పండ్లలో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మీ ఎముకలకు బలం చేకూరుస్తాయి.
ఖర్జూర పండ్లలో కొలెస్ట్రాల్, చక్కెర తక్కువగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు.
చక్కెర శాతం తక్కువగా ఉండటం చాలా ప్రయోజనకరం. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే పండ్లలో ఖర్జూరం కూడా ఒకటి.
ఆయుర్వేదానికి అనుగుణంగా, ఖర్జూరం.. శారీరక బలహీనత, లో బీపీ, గుండె జబ్బులు అధిక దాహం వంటి సమస్యలతో పోరాడటానికి ఖర్జూర పండ్లు ఉపయోగపడతాయి.
ఖర్జూర పండ్లలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంతో సాయపడతాయి.
డేట్స్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. మీరు ప్రతి ఉదయం 2 డేట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అతి కొద్ది రోజుల్లోనే స్పష్టంగా కనిపిస్తాయి.
శరీరంలో తక్కువ స్థాయిలో ఇనుము ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఖర్జూర పండ్లలో అధిక స్థాయిలో ఇనుము ఉంటుంది.
బ్రీతింగ్ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలను కూడా ఎదుర్కొనడంలో కూడా డేట్స్ ఎంతో సహాయపడతాయి. అందుకే వీటిని రోజు తినాలి.