సపోటా పండును ఎలా తిన్నా.. తాగినా లాభాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక సపోటా పండులో మనకు ఎన్నో రకాల పోషకాలు లభించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
సపోటా పండులో ఫోలేట్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మినరల్స్, విటమిన్స్ వంటి పోషక పదార్థాలు చాల ఉంటాయి.
అంతేకాదు ఈ సపోటా పండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు శరీరంలోకి వైరస్ బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లు చేరకుండా కాపాడుతాయి.
దీంతో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారడానికి సహాయపడుతాయి. ఇక ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సమస్యలు దూరమవుతాయి.
ఎవరైనా సరే చూపు మందగించిందని బాధపడేవారు క్రమం తప్పకుండా సపోటాలు తినడం వల్ల కంటి చూపు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్, పీచుపదార్థాలు ఉండడంవల్ల క్యాన్సర్ కారక వైరస్‌ను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
గర్భం ధరించిన స్త్రీలు, బాలింతలు కూడా సపోటా పండ్లు తినవచ్చు. ప్రతి రోజూ రెండు సపోటా పండ్లు తింటే క్యాన్సర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.