మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పు తినొచ్చా..
14 August 2023
భారతదేశంలో మధుమేహ వ్యాధితో బాధపడేవారు చాలామంది ఉంటారు. వీరు ఆహారం కోసంప్రత్యేక డైట్ మెయింటెన్ చేయాలి.
అయితే డ్రైఫ్రూట్స్‌లో భాగంగా ఉండే జీడిపప్పుని మధుమేహ వ్యాధిగ్రస్థులు తినవచ్చా తింటే ఏం జరుగుతుంది తెలుసుకుందాం.
వాస్తవానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పుని తినవచ్చు. ఎందుకంటే ఇవి వారిలో గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి.
నిజానికి జీడిపప్పులో ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
జీడిపప్పులో ఉండే పోషకాలు కారణంగా ఇది తీసుకోవడం ద్వారా మధుమేహంతో పాటు గుండెను ఫిట్‌గా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తు్న్నారు.
అంతే కాదు జీడిపప్పు తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లు జీడిపప్పు తినడం నిషేధించకపోవడానికి కారణం ఇదే.
జీడిపప్పు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. అంతే కాకుండా జీడిపప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
జీడిపప్పులో విటమిన్-ఈ, యాంటీ-ఆక్సిడెంట్ల లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక సమస్యల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి