22 August 2023

ఎండు ఖర్జూరాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

ఎండు ఖర్జూరాల్లో ఎన్నో రకాల ప్రయోజనకర పోషకాలు ఉన్నాయి. అంటే వీటిని తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

ఎండు ఖర్జూరాల్లో అవసరమైన కాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్, ఐరన్, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉన్నాయి.

ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్త పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు దూరం కావడంతో పాటు బరువు తగ్గుతారు.

ఖర్జూరాల్లో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీర నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇంకా చర్మ, కేశ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఎండు ఖర్జూరాలు నేచురల్ స్వీటనర్లు. ఫలితంగా వీటిని తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారి షుగర్ లెవెల్స్‌పై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.

పైగా ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రించగలవు. ఫలితంగా మధుమేహంతో బాధపడేవారికి మేలు జరుగుతుంది.

ఎండు ఖర్జూరాల్లోని కాల్షియం, ఫాస్పరస్ మీ ఎముకలను పటిష్ట పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ దంతాలను కూడా దృఢంగా చేస్తాయి.

ఇకపోతే ఈ ఎండు ఖర్జూరాల ప్రయోజనాల కోసం మీరు ఎలాంటి శ్రమ తీసుకునే అవసరం లేకుండా వీటిని నేరుగా తీసుకోవచ్చు.