27 August 2023
ధనియాల నీటితో ఆ సమస్యలన్నీ దూరం..
ధనియాలు నానబెట్టిన నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.
అధిక బరువు ఉన్నవారు ధనియాలు నానబెట్టిన నీరు తాగితే మెరుగైన పలితాలు పొందుతారు. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం కోసం కూడా ధనియాల నీరు ఉపయోగపడుతుంది. ధనియాల పోషకాలు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ధనియాల నీటిలోని పోషకాలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కూడా తగ్గిస్తాయి. ఫలితంగా డయాబెటిక్ రోగులకు మేలు జరుగుతుంది.
ఐరన్ ఉన్న కారణంగా ధనియాల నీరు రక్తహీనతకు చెక్ పెడతాయి. ఇంకా రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది.
విటమిన్ ఎ, సి, ఇ, కెరోటినాయిడ్స్ వంటి పలు పోషకాలు ధనియాల నీటిలో ఉంటాయి. ఈ కారణంగా ధనియాల నీళ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
ధనియాల నీటిలోని కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలను దృఢ పరచడంలో కీలకంగా పనిచేస్తాయి.
ధనియాలను నానబెట్టిన నీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అన్ని రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి..