పశ్చిమోత్తనాసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
2 August 2023
కూర్చున్న స్థితిలో కాళ్లను ముందుకు చాపి, మడమలను, కాళ్లను కలపే ప్రయత్నం చేయాలి.
వీపు భాగం గట్టిగా ఉంటే చేతులతో పట్టుకుంటూ పాదాల చుట్టూ ఉంచాలి.
మోకాలు కొద్దిగా వంచి.. కాళ్లు ముందుకు సాగేలా చూసుకోవాలి.
వెన్నెముకను నిటారుగా ఉంచుతూ ముందుకు వంచాలి. బొటనవేళ్లను వేళ్లతో పట్టుకోవాలి.
తలతో మోకాళ్లను తాకాలి. పశ్చిమోత్తనాసనం వల్ల ఎన్నో ప్రయోనాలున్నాయి.
ఈ ఆసనం కొంత కష్టమైనప్పటికి అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది.
శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి.. మనస్సును రిలాక్స్‌గా ఉంచడంలో ఈ ఆసనం దోహదపడుతుంది.
తలకు రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది. తద్వారా మనస్సుకు విశ్రాంతి, నిద్రలేమి, నిరాశ, ఆందోళనను తగ్గిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి