కొవ్వును కరిగించే మామిడికాయ!

TV9 Telugu

17 April 2024

సమ్మర్ అంటే చాలు అందరికి ఇష్టమైన మామిడి సిద్ధంగా ఉంటుంది. వేసవిలో విరివిగా దొరికే మామిడితో ఎన్నో ప్రయోజనాలు.

వేసవిలో ప్రతి ఒక్కరినీ నోరూరించే మామిడికాయలతో పచ్చిపులుసు నుంచి ఆవకాయ వరకు ఎన్నో రకాలను చేసుకోవచ్చు.

వంద గ్రాముల మామిడికాయలో పిండిపదార్థాలు 15 గ్రా., కొవ్వు 0.4 గ్రా., పీచు 1.6 గ్రా., 0.8 గ్రా., ప్రొటీన్లు ఉంటాయి.

పచ్చి మామిడికాయలో విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మామిడికాయలు చలవ చేస్తాయి. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూస్తాయి. మామిడి పండుతో పోలిస్తే కాయలో కెలొరీలు తక్కువ.

జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

మామిడికాయలు శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తాయి. ఈ కాయలో విటమిన్‌-బి3 పుష్కలంగా ఉంటుంది.

జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం, అజీర్తితో బాధపడేవారు దీన్ని తీసుకుంటే ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.