రోజూ గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..

13 August 2023

గుమ్మడికాయ గింజల్లో వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలను కొన్ని వందల ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.

గుమ్మడి గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వల్ల కొలొరెక్టల్, రొమ్ము, కడుపు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. గుమ్మడికాయ గింజలు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దీనిని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం.

గుమ్మడికాయ గింజల్లో అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఈ విత్తనాలు ట్రిప్టోఫాన్, జింక్, మెగ్నీషియంతో నిండి ఉంటాయి.

గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉన్న కారణంగా వీటిని తింటే ఎముకలు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

రక్తపోటు, రక్తంలో చక్కెర, గుండె, ఎముకల ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మెగ్నీషియం స్థాయిలు అవసరం. ఇవి ఎముకలు పగుళ్లు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి.