బంగాళాదుంపలతోనే కాదు.. తక్కలతోను ఎన్నో లాభాలు...

12 August 2023

బంగాళాదుంపలతో ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇవి బరువు పెంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గించడంలో, సోడియం స్థాయిని నియంత్రించడంలో సహయపడతాయి.

అయితే కేవలం బంగాళాదుంపలు మాత్రమే కాకుండ వాటి తొక్కలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలుసా. ఆలు తొక్కలలో ఎన్నో పోషకాలున్నాయి.

బంగాళాదుంపల తొక్కలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలును అందిస్తాయి. బంగాళాదుంపల తొక్కలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది.

అంతేకాకుండా.. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్ బీ3, పోషకాలు అధికంగా ఉంటాయి. ఆలు తొక్కలతో కలిగే ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

బంగాళాదుంప తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అనేక వ్యాధులను తగ్గిస్తాయి.

వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆలు తొక్కలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.