యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
24 August 2023
యాలకుల వాడకం ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటితో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
యాలకులను సాధారణంగా నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. రోజూ నమిలి తింటే నోటి దుర్వాసన పోతుంది.
ఫేస్ నిగారింపు కోసం మీరు యాలకులను ఉపయోగించవచ్చు. ముఖానికి ఏలకుల నూనెను ఉపయోగిస్తే అది మచ్చలను తొలగించి మెరిసిపోయేలా చేస్తుంది.
యాలకుల పొడి చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. గంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
యాలకులను చాలా బ్యూటీ ప్రొడక్ట్స్, లిప్ కేర్ క్రీములలో ఉపయోగిస్తారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకోవాలి.
దానిని తేనెలో మిక్స్ చేసి పెదవులపై రుద్ధి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోని క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.
శరీరం డిటాక్సిఫై అవుతుంది: క్రమం తప్పకుండా యాలకులను తింటే అవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడతాయి.
శరీర నిర్విషీకరణ ప్రభావం ముఖంపై కూడా కనిపిస్తుంది. దీంతో చర్మం క్లీన్‌గా మారి ముఖంపై అద్భుతమైన గ్లో వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి