14 August 2023
అరటి పండ్లను తినేవారిలో చాలా మంది తరచూ చేసే తప్పు తొక్కను పారేయడం. నిజానికి పండుతో సమానమైనన్ని ప్రయోజనాలను తొక్క కూడా అందించగలదు.
ఈ క్రమంలో అరటి తొక్కతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగిన కారణంగా ఆరటి తొక్క శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అరటి తొక్కలోని పోటాషియం శరీరంలో అధిక బీపీ సమస్యను కంట్రోల్ చేస్తుంది. ఇంకా గుండె సమస్యలను దూరం చేస్తుంది.
పసుపు దంతాల సమస్యతో బాధపడేవారికి కూడా అరటి తొక్క సహాయంగా ఉంటుంది. ఇందులోని కాల్షియం దంతాలను దృఢంగా చేస్తుంది.
అరటి తొక్కలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచి.. మలబద్దకం, అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది.
మొటిమల నివారణకు కూడా అరటి తొక్క ఉపయోగకరం. ఇందుకోసం మీరు అరటి తొక్కను మొటిమలపై రుద్దితే చాలు.
అరటి తొక్కలోని పోషకాలు, మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంపై దురద సమస్యలను కూడా నివారిస్తాయి. ఇంకా సోరియాసిస్ సమస్యను కూడా దూరం చేస్తుంది.