గోడకుర్చీతో బీపీ నుంచి ఉపశమనం..
09 August 2023
వారంలో మూడుసార్లు గోడకుర్చీ వేస్తె మంచి ఫలితాలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 16 వేల మందిపై జరిపిన పరిశోధనలో దీన్ని వెల్లడించారు.
రక్తపోటుని తగ్గించడానికి చేసే ప్లాంక్, వాల్‌స్క్వాట్స్ వ్యాయామాలు కండరాల్ని బలోపేతం చేసేవని ఒక అధ్యయనం తేల్చింది.
అయితే, ఏరోబిక్ ఎక్స్‌ర్‌సైజుల కంటే గోడకుర్చీ, నేలపై చేసే ప్లాంక్ వంటి వ్యాయామాలే బీపీని తగ్గిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.
కండరాలు, కీళ్లను కదలించకుండా చేసే ప్లాంక్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు వల్ల కండరపుష్టి పెరుగుతుంది.
పుషప్‌ను పోలి ఉండే ప్లాంక్ వ్యాయామం వల్ల పొత్తికడుపు దృడంగా తయారువుతుంది. కాలి వేళ్లు, మోచేతుల మీద భారం వేస్తూ దీన్ని చేస్తారు.
అధిక రక్తపోటు కారణంగా గుండె, ఇతర అవయవాల్లోని రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
స్క్వాట్స్ అంటే గోడకు వీపును ఆనించి కూర్చున్నట్లుగా ఉండటం వల్ల అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది.
వారానికి మూడుసార్లు రెండు నిమిషాలు వాల్ స్క్వాట్స్ వేస్తే బీపీ అదుపులో ఉండడంతో పాటు హృదయ వ్యాధులు దూరమవుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి