ఈ చిట్కాలతో పొడి దగ్గు నుంచి ఉపశమనం..
TV9 Telugu
17 November 2024
వాత, పిత్త, కఫం అసమతుల్యత వల్ల పొడి దగ్గు వస్తుందని ఆయుర్వేదంలో చెబుతారు. సాధారణంగా దగ్గు ఒక వ్యక్తిని రెండు విధాలుగా ఇబ్బంది పెడుతుంది.
మొదటి కఫం దగ్గు ఇందులో శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది. రెండోది పొడి దగ్గు ఇందులో శ్లేష్మం ఉండదు కానీ గొంతులో నొప్పి, మంట ఉంటుంది.
చాలా సార్లు దగ్గడం వల్ల వ్యక్తి పక్కటెముకలు కూడా గాయపడుతాయి. అయితే పొడి దగ్గు సులభంగా నయం కాదు దీంతో ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడతాడు.
ఇలాంటి సమయంలో ఇంట్లో దొరికే వీటిని ఉపయోగిస్తే మంచిది. మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
పొడి దగ్గుకి తేనె గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. తేనెను రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవాలి. నిద్రవేళలో గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి.
దేశీ నెయ్యిలో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇది పొడి దగ్గుకి చక్కటి నివారణ.
తులసి ఆకుల, అల్లం రసాన్ని తేనెతో కలిపి రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకోండి. ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీటిలో తేలికపాటి రాతి ఉప్పు వేసి గార్గ్ చేయాలి. ఇది మంట, ఇన్ఫెక్షన్‌ని తొలగిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఫారెన్ టూర్ ప్లాన్ ఉందా.? ఈ ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్..
రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై ఎలా పొందాలి..
కారులో ఈ లోపాలు గుర్తించారా.? అయితే బ్యాటరీ సమస్య ఉన్నట్టే.?