మన శరీరం లోపలి అవయవాల్లో కాలేయమే అతి పెద్దది. ఒకరకంగా దీన్ని అవిశ్రాంత కర్మాగారంతో పోల్చుకోవచ్చు. నిరంతరం ఒకే సమయంలో ఎన్నెన్నో పనులను నిర్వహిస్తుంటుంది
TV9 Telugu
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాలేయంలో ఆటంకం ఏర్పడితే.. అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి. ఆహారంపై తగిన శ్రద్ధ పెట్టాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని తప్పక రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి
TV9 Telugu
బెర్రీలు, చిక్కుళ్ళలో అధికంగా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇది కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
TV9 Telugu
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలు కాలేయానికి మేలు చేస్తాయి. ఇటువంటి కూరగాయలు కాలేయ నిర్విషీకరణలో సహాయపడతాయి
TV9 Telugu
సముద్ర చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకం కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. శారీరక మంటను తగ్గిస్తుంది. కాబట్టి ఆహారంలో చేపలను తప్పక చేర్చుకోవాలి
TV9 Telugu
అలాగే రోజువారీ ఆహారంలో పసుపు జోడించడం మర్చిపోకూడదు. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కాలేయానికి మేలు చేస్తాయి.
TV9 Telugu
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సెలీనియం ఉంటుంది. ఈ పదార్థం కాలేయం నుంచి టాక్సిన్స్ క్లియర్ చేయడానికి, వాపు తగ్గించడానికి సహాయం చేస్తుంది
TV9 Telugu
రోజూ 3-4 కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ టీలోని కాటెచిన్స్ కాలేయ పనితీరును మెరుగుపరిచి అనారోగ్యం పాలుకాకుండా కాపాడుతుంది