వీటితో ఎముకలు ఆరోగ్యం పదిలం..
10 August 2023
ఎముకలు బలంగా ఉంటే రోజువారీ కార్యకలాపాలు సులువుగా చేసేందుకు శరీరం సహకరిస్తుంది. మరి ఎముకలు బలంగా ఉండాలంటే మంచి ఆహరం తీసుకోవాలి.
ఎముకలు పుష్టిగా ఉండాలంటే బలవర్ధకమైన ఆహారం తినాలి. బలమైన ఎముకలకు కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం అనేక రకాల ఆహారాలలో లభిస్తుంది.
పాలు, గుడ్లు, నువ్వులు, రాగులు, కిడ్నీ బీన్స్ లేదా రాజ్‌మా, సోయా బీన్స్, బాదం పప్పు, బ్రొకోలీ కూరగాయల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
వీటితోపాటు పాటు గసగసాలు కూడా ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
గసగసాల్లో కాల్షియంతోపాటు, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
వీటిని రోజువారీ ఆహారంలో వివిధ మార్గాల్లో తినవచ్చు. గసగసాల్లో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది.
వీటిని తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే గసగసాలలో కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి.
ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిల్లోని థియోనిన్ అనే అమైనో ఆమ్లం రాత్రిళ్లు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి