కడుపులో కుడివైపున నొప్పి వస్తుందా..? డేంజర్‌లో ఉన్నట్లే..

06 September 2023

శరీరంలో నొప్పులు అనేవి సహజం. కానీ.. శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో వచ్చే నొప్పిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కడుపులో కుడి వైపున నొప్పి డేంజర్.. కుడివైపు నొప్పికి చాలాకారణాలుంటాయి. పొట్టకు కుడివైపున చాలా అవయవాలు ఉంటాయి. కావున ఈ నొప్పి తీవ్రమైనదిగా మారి.. ఒక్కొసారి ప్రాణాలు కూడా తీస్తుంది.

అపెండిసైటిస్ కావచ్చు: అపెండిసైటిస్ అనేది కుడి వైపున కడుపు నొప్పికి కారణాలలో ఒకటి. నాభి చుట్టూ నొప్పి మొదలై కుడివైపు క్రిందికి కదులుతుంది. 24 గంటల వ్యవధిలో తీవ్రమవుతుంది. తక్షణ వైద్యం అవసరం. 

కడుపులో రాళ్లు: పొత్తికడుపులో నొప్పి తరచుగా వస్తుంటే.. నిర్లక్ష్యం చేయవద్దు. ఈ ప్రదేశంలో నొప్పి అనేక రకాల అంతర్లీన సమస్యలను సూచిస్తుంది. రాళ్లు కూడా కావొచ్చు.

గాల్ బ్లాడర్ సమస్య: గాల్ బ్లాడర్ సమస్యలు కూడా నొప్పికి కారణమవుతాయి. పిత్తాశయ రాళ్లు ఎగువ, కుడి పొత్తికడుపులో వాపు, నొప్పిని కలిగిస్తాయి.

మూత్రపిండంలో రాళ్లు: కిడ్నీ స్టోన్స్ వెనుక నుంచి దిగువ కుడి పొత్తికడుపు వరకు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. నొప్పి సాధారణం నుంచి అధికం, తీవ్రమైనదిగా మారుతుంది. 

ప్రేగు సంబంధిత సమస్యలు: ప్రేగు సిండ్రోమ్ (IBS), క్రోన్స్ వ్యాధి లేదా డైవర్టికులిటిస్ వంటి వివిధ ప్రేగు సంబంధిత సమస్యల వల్ల కుడి వైపున కడుపు నొప్పి సంభవించవచ్చు. 

కడుపులో కుడివైపున తరచుగా నొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు పేర్కొంటున్నారు.