చలికాలంలో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించే చిట్కాలు..
02 January 2023
చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత భారీగా తగ్గడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.
చలికి భయపడి వర్కవుట్స్ చేయడం మానకూడదు. కనీసం యోగా, డ్యాన్సింగ్, వాకింగ్ లాంటి చిన్న చిన్న వ్యాయామాలు అయినా చేయాలి. మొత్తం యాక్టివ్‌గా ఉండాలి.
స్మోకింగ్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో స్మోకింగ్ చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక చలి కాలం కచ్చితంగా ఉన్ని దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చెవులు కవర్ అయ్యేలా క్యాప్స్‌లను వేసుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లు కూడా ధరించాలి.
చలికాలం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
ఇక చలికాలం చాలా మంది చేసే తప్పు తక్కువగా నీరు తీసుకోవడం. అయితే కాలంతో సబంధం లేకుండా కచ్చితంగా నీరు తాగాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకునే యోగసానాలు చేయాలి. మెడిటేషన్ వంటి చర్యల ద్వారా మానసిక ఒత్తిడిని జయించాలి. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటిండచమే ఉత్తం.