ఈ పండ్లు ఎముకలకు కొండంత అండ..

21 August 2023

శరీరాన్ని నిలబెట్టేది ఎముకలు మాత్రమే.. ఎముకలు మనిషిని ఓ రూపును తీసుకొనివస్తాయి. ఏ ప‌ని చేయాల‌న్నా ఎముకలు బ‌లంగా.. దృఢంగా ఉండాలి.

నిల‌బ‌డాల‌న్నా.. కూర్చోవాల‌న్నా.. న‌డవాల‌న్నా.. ప‌రుగెత్తాల‌న్నా.. ఇలా ఏం చేయాలన్నా ఎముక‌లు దృఢంగా ఉండాల్సిందే.

అయితే పండ్లతో ఎముక‌లను దృఢ‌ంగా తయారుచేసుకోవచ్చు. ఇప్పడు దృఢమైన ఎముక‌లు కోసం తీసుకోవలసిన పండ్లు ఏంటో తెలుసుకుందాం.

ప్ర‌తిరోజు యాపిల్ తింటే డాక్ట‌ర్ అవ‌స‌రం ఉండదంటూ చాలామంది వైద్యనిపుణులు పేర్కొంటుంటారు. అయితే ఎముక‌లు బ‌లంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

పైనాపిల్‌ పండుతో ఎముకలను బలంగా తయారు చేసుకోవచ్చు. దీనిలో పొటాషియం, కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. ఇది కాల్షియం లోటును త‌గ్గిస్తుంది.

స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి ఎముక‌లు గుల్ల‌గా మార‌డాన్ని అడ్డుకొని బలంగా తయారు చేస్తాయి.

బొప్పాయి శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంతోపాటు ముఖ్యంగా ఎముక‌లను దృఢంగా చేసేందుకు దొహదపడుతుంది.

ట‌మాటాల్లో ఎముకల బలానికి సంబంధించిన అనేక పోషకాలు ఉన్నాయి. దీనిలో విట‌మిన్ కే, కాల్షియం, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.