పుట్టగొడుగులతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు..

13 August 2023

మష్రూమ్‌ను చాలామంది ఇష్టంతో తింటారు. అయితే పొట్ట గొడుగులు తినడం ఆరోగ్యానికి చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి.. కొనుగోలు చేసేటప్పుడు ఎలా ఎంచుకోవాలి.. అనే విషయాలను తెలుసుకోండి.

పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

పుట్టగొడుగులలో ఉండే బీటా గ్లూకాన్ ఒక రకమైన డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

మష్రూమ్ పొటాషియానికి మంచి మూలం. ఇది శరీరంలో సోడియం ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను కూడా సడలిస్తుంది.

పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుట్టగొడుగులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి .

మష్రూమ్స్‌లో ఉండే పాలీశాకరైడ్‌లు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పని చేస్తాయి. దీనితో పాటు ఇవి ఇన్ఫెక్షన్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

పుట్టగొడుగులు తాజాగా ఉన్నాయో లేదో చూడండి. మష్రూమ్స్ మృదువుగా ఉండాలి. పైన పొడిగా ఉండేలా చూసుకోవాలి.