వర్షాకాలంలో చేపలు తింటే ఆ సమస్యలను పాకెట్లో పెట్టుకొన్నట్టే..
19 July 2025
Prudvi Battula
ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా ప్రతినిత్యం వర్షాలు పడటం వల్ల వరద నీరు కారణంగా నీటి కాలుష్యం ఎక్కువైపోతోంది.
ఇలాంటి నీటిలో పెరిగే చేపలు, ఇతర సి ఫుడ్స్‌లో కూడా ఈ కాలుష్య కారకాలను చేరుతాయి. వాటిని తింటే వాంతులు, విరేచనాలు తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.
వర్షాలకు నీటిలో పాదరసం మలినాలు బాగా పెరిగి చేపల కణజాలాల్లో పేరుకుపోతాయి. వీటిని తింటే వణుకు, మూడ్ మార్పులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కండరాల బలహీనత, నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
వర్షాకాలంలో నీటిలో బ్యాక్టీరియా, వైరస్లు ఎదుగుదలకు అనుకూలమైనది. కనుక సి ఫుడ్స్ తీసుకుంటే వీటిని కారణం ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
ఈ కాలంలో నీరు కలుషితంగా ఉన్నందున చేపలు తినడం వల్ల అతిసారం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కలుషితమైన చేపలను తినడం వల్ల దద్దుర్లు, దురద, కడుపు నొప్పి, వంటి సమస్యలు వస్తాయి.
అలాగే వర్షంలో సి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ముఖం, పెదవులు, నాలుక లేదా గొంతుపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో గురక, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చేపలు, ఇతర సముద్ర ఆహారాన్ని దూరం పెట్టడం మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు.