రాత్రి సమయంలో పెరుగన్నం తినడం వల్ల ఎన్నో నష్టాలు..
12 August 2023
దాదాపుగా అన్ని ఇళ్ళల్లో పెరుగు ఉంటుంది. పెరుగు లేనిదే భోజనం అసంపూర్ణం అనుకొనేవారు చాలామంది ఉన్నారు.
పాల నుంచి ఉత్పత్తి అయినా పెరుగు ఒక అద్భుతమైన పదార్థం. పెరుగు జీర్ణక్రియకు, కాల్షియం లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
పెరుగు తీసుకునేవారిలో డయారియా, ఒంట్లో వేడి తత్వాన్ని తగ్గిస్తుంది. ఇంకా పెరుగుతో అనేక ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే.
పెరుగులో ప్రయోజనాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట పెరుగన్నం తీసుకోవడం మంచిది కాదంటుంది ఆయుర్వేదం.
తీపి, పులుపు రెండూ కలగలిపి ఉన్న కారణంగా పెరుగన్నం రాత్రిపూట తినడం వల్ల నాసికా మార్గంలో శ్లేష్మం ఏర్పడుతుంది.
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు పెరుగన్నం రోజూ తీసుకోకూడదు. పుల్లని ఆహారాలు వల్ల కీళ్ల నొప్పుల పెరుగే అవకాశం ఉంది.
ర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, తరచుగా అసిడిటీ, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతుంటే పెరుగన్నం తినడం మానేయాలి.
ఆస్తమా, దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట కాకుండా పెరుగును మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి