రాత్రుళ్లు వైట్ రైస్‌కు బదులుగా చపాతీలు తింటున్నారా.?

Ravi Kiran

09 Aug 2024

బరువును కంట్రోల్‌లో పెట్టుకునేందుకు, బాడీని ఎలప్పుడూ ఫిట్‌గా ఉంచుకునేందుకు ఇటీవల యువత ఎక్కువగా రాత్రుళ్లు వైట్ రైస్‌కు బదులుగా చపాతీలు తింటున్నారు. 

అయితే బరువును నియంత్రించేందుకు ఇలా ఉన్నఫలంగా రాత్రి వేళల్లో వైట్ రైస్ మానేయడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. 

డైట్‌లో భాగంగా ఒక పూట మొత్తంగా రైస్ మానేయడం కంటే.. అన్నం తక్కువ తీసుకుని.. ఆ స్థానంలో చపాతీలు తినడం బెటర్ అని వైద్యులు ఇచ్చే సూచన.

రాత్రుళ్లు వేడివేడిగా చపాతీలు చేసుకుని తినడం కంటే.. నిల్వ ఉన్న చపాతీలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. 

వేడివేడిగా చేసే చపాతీలలో నూనె కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

సాధారణంగా ఎక్కువ సేపు నిల్వ ఉండే ఆహార పదార్ధాలలో పోషకాలు అంతమైపోతాయని అంటారు. చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు తెలిపారు.

రాత్రిపూట నిల్వ ఉంచిన చపాతీలు తినాలని.. అలా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు దరికి చేరవని వైద్య నిపుణులు అంటున్నారు.

మరోవైపు రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తినడం వల్ల ఎంతో ఉపయోగకరం అని అన్నారు.