23  August 2023

ఈ ఫ్రూట్‌తో క్యాన్సర్‌కి చెక్.. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయంటే..? 

డ్రాగన్ ఫ్రూట్‌ని వారంలో ఒక్కసారి తిన్నా కాన్సర్ సమస్యను నిరోధించవచ్చు. ఈ ఫ్రూట్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ రిస్క్‌ని తగ్గిస్తాయి, అలాగే శరీరంలోని క్యాన్సర్ కణాలను విచ్చిన్నం చేస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్ రక్తహీనతతో బాధపడేవారికి వరం లాంటిది. దీనిలోని ఐరన్ రక్త కణాల వృద్ధిని ప్రోత్సాహించి, రక్తహీనతను తగ్గిస్తాయి.

ఈ ఫ్రూట్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా మెరుగు పరిచి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి.

డయాబెటీస్ ఉన్నవారు తప్పక తీసుకోవలసిన పండు ఇది. దీనికి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచగల శక్తి ఉన్నందున షుగర్ లెవెల్స్‌ని కూడా నియంత్రిస్తుంది.

దీనిలోని విటమిన్లు శరీరంపై అయిన గాయాలను నయం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి. అందుకోసం మీరు వారంలో ఒక్కసారి అయినా డ్రాగన్ ఫ్రూట్‌ని తీసుకోండి.

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లే కాక ఒమేగా 3, ఒమెగా 9 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నందున గుండె పనితీరు మెరుగుపడుతుంది.

అధిక మొత్తంలో ఫైబర్‌ని కలిగిన ఈ పండు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

డ్రాగన్‌ ఫ్రూట్‌లో విటమిన్ ఇ ఉన్నందున ముఖంపై మొటిమలు, మచ్చలు మాయమైపోతాయి. ఇంకా వృద్ధాప్య లక్షణాలను నెమ్మందిపజేస్తుంది.