టీ బ్యాగ్‌లతో టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..

17 August 2023

బిజీ లైఫ్‌ షెడ్యూల్‌ మూలంగా మనలో చాలా మంది రోజువారీ ఆహారంపై అంతగా శ్రద్ధ పెట్టరనేది కాదనలేని నిజం.

జీవనశైలి మూలంగా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అందుకు గల ప్రధాన కారణాల్లో రోజూ తాగే టీ బ్యాగ్‌లు కూడా ఒకటి.

బరువు తగ్గడానికి, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనే తపనతో యువకుల నుంచి వృద్ధుల వరకు అనేక మంది టీ బ్యాగ్‌లను వినియోగిస్తున్నారు.

మార్కెట్లో అనేక బ్రాండ్‌ల టీ బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ విధమై టీ బ్యాగ్‌లతో టీ తయారు చేసుకుని తాగితే అనేక దుష్ప్రభావాలు సంభవిస్తాయి.

ఏయే వ్యక్తులు టీ బ్యాగ్‌లతో తయారు చేసిన టీకి దూరంగా ఉండాలి? టీ తాగేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్య విషయాలు మీకోసం.

మధుమేహ రోగులు టీ బ్యాగ్‌లతో టీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని డిస్టర్బ్‌ చేస్తుంది.

ఎక్కువ కెఫిన్ ఉన్న టీ బ్యాగ్‌లు డయాబెటిక్ రోగి ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తాయి. షుగర్ పేషెంట్ టీ బ్యాగ్‌లు తాగడానికి ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

నిద్రలేమి సమస్యతో బాధపడే వ్యక్తులు కూడా టీ బ్యాగ్‌లను తాగకూడదు. కెఫిన్ అధికంగా వినియోగిస్తే నిద్రలేమికి కారణమవుతుంది.