చెరకు రసంతో ఈ సమస్యలు పరార్..

14 August 2023

చెరకులో కాల్షియం ఎముకలు, దంతాలుఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చిన్నపిల్లల వెన్నెముక బలంగా మార్చి ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది.

దీంతో అలసట తగ్గి తక్షణ శక్తి కోసం గ్లాసు చెరకురసం తాగితే చాలు.. ఇందులో ఉండే సూక్రోజు కారణంగా నీరసాన్ని తగ్గించి శక్తినిస్తుంది.

గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది.

పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.

జీర్ణాశయంలో పీహెచ్‌ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం చెరకు రసంలో ఉంది. దీంతో ఇది అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచుతుంది.

శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.

గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు గ్లాసు చెరకు రసానికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్లఉప్పు కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

రొమ్ము కాన్సర్‌ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కణాలు అడ్డుకుంటాయి.