రాగులు చాలా మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున రోజూ రాగి జావ తాగితే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలసుకుందాం.
రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగుల్లో లభిస్తాయి.
రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నాయి. రాగి జావ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.
రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి.
రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి.
ప్రతిరోజు రాగి జావ తాగడం వల్ల ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుందంటున్నారు నిపుణులు.
కావున ఉదయాన్నే రాగి జావ తాగితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో రాగి పిండి కలిపి జావలా చేసుకోని తాగాలి.
రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోవచ్చు. ఇది ఆరోగ్యమే కాదు మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది.