మధ్యాహ్నం భోజనంలో వీటిని అస్సలు తీసుకోకూడదు..

19 August 2023

మనం తీసుకునే భోజనంలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమై కొవ్వులు, ఫైబర్, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉద్యోగాలకు.. షాపులకు వెళ్లేవారు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తారు. అలాగే మరికొందరు మధ్యాహ్నం సమయంలో పిజ్జా, బర్గర్, పాస్తా, శాండ్ విచ్ తినడానికి ఇష్టపడతారు.

కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అవి శరీరానికి శక్తి ఇవ్వకపోవడమే కాకుండా.. అలసటను పెంచుతాయి.

వెజిటబుల్ సూప్ తక్కువ కేలరీలు, పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్ ఉండదు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అందుకే మధ్యాహ్నం సమయంలో సూప్ అస్సలు తీసుకోవద్దు.

ఫాస్ట్ పుడ్ లో చాలా కొవ్వు ఉంటుంది. ఇది కడుపు నింపుతుంది. కానీ అలసటను, నీరసాన్ని కలిగిస్తుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు.

పాస్తా.. ఇది శుద్ది చేసిన కార్బ్, ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిని తిన్న వెంటనే మంచి నిద్ర వస్తుంది. మధ్యాహ్నం భోజనంలో పాస్తాను అస్సలు తినకూడదు.

వెయించిన పదార్థాలలో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యమైన కొవ్వులు ఆరోగ్యానికి హాని కలిగిస్తుయి. అందకే మధ్యాహ్నం భోజనంలో  తీసుకోవద్దు.

ప్రీమేడ్ సాండ్ విచ్‏లను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇందులో చాలా ప్రిజర్వేటివ్ లు, సాస్ లు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.