ఈ ఫుడ్స్‌ను ‘టీ’తో అస్సలు తినొద్దు.. డేంజర్‌లో పడ్డట్టే!
Ravi Kiran
09 Aug 2024
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ 'టీ' చాలా అవసరం. వారి అలసట నుంచి కాస్త రిలీఫ్‌ను ఇస్తుంది ఈ పానీయం. మరికొందరైతే 'టీ'తోనే రోజు ప్రారంభమవుతుంది.
ఇంకొందరైతే రోజుకు రెండు లేదా మూడు సార్లు 'టీ' తాగుతుంటారు. ఇక ఆఫీస్‌లో పని చేసేవారికైతే వర్క్ నుంచి ఉపశమనం పొందేందుకు 'టీ' కంపల్సరీ.
కొందరు టీతో పాటు ఇష్టమొచ్చిన స్నాక్స్ తింటారు. అలా ఏది పడితే అది 'టీ'తో పాటు తినకూడదు. తింటే డేంజర్‌లో పడినట్లే.. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా.?
ఆకుకూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను వేడి వేడి కప్పు టీతో తినకూడదు. యా ఫుడ్స్‌లోని ఐరన్‌ను శరీరానికి అందకుండా చేస్తాయి.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, టీతో నిమ్మకాయను కలపకూడదు.
లెమన్ టీ అనేది బరువు తగ్గించే చిట్కాగా అందరూ భావిస్తారు. అయితే టీ ఆకులను నిమ్మకాయతో నేరుగా కలపడం వల్ల అధిక ఆమ్లత్వం, త్రేనుపు, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు వస్తాయి.
టీతో పాటు పసుపు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినవద్దు. ఈ రెండు కలిసినప్పుడు రసాయన ప్రతిచర్య ఉంటుంది. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
చాయ్‌తో పాటు పకోడీ అస్సలు తినకూడదు. అలా తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.
టీతో పాటు చల్లటి పదార్ధాలను అస్సలు తినకూడదు. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల వికారం, మైకం, జీర్ణక్రియపై చెడు ప్రభావం పడటం లాంటివి ఏర్పడతాయి.