స్పెర్మ్ నాణ్యత విషయంలో ఒత్తిడి, ఆందోళన కీలక పాత్ర పోషిస్తాయా..

10 August 2023

పునరుత్పత్తికి కీలకమైన కణం స్పెర్మ్. పురుషుల నుంచి వచ్చే వీర్యంలోనే స్పెర్మ్ ఉంటుంది. దీన్ని మిలియన్లలో లెక్కిస్తారు.

సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఉంటుంది.

ప్రస్తుత కాలంలో ఈ కణాల ఆరోగ్యకరంగా లేకపోవడం, కదలికలు చురుగ్గా లేకపోవడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

దీని కారణంగా ఎంతో మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. వీర్యకణాలు తగ్గితే సంతాన సమస్యలే కాదు ఇంకా సమస్యలు వస్తాయి.

దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్‌, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిర్దిష్ట వృత్తిపరమైన పరిసరాలలో వేడి, ద్రావకాలు బహిర్గతం కావడం వల్ల స్పెర్మ్ నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.

పని ఒత్తిడి, ఆందోళన కారణంగా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.

మద్యపానం నుండి దూరంగా ఉండటం వలన చలనశీలతపై ఆల్కహాల్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తిప్పికొట్టవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.